Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహసూద్‌ను పట్టుకొని తీరతాం: పాకిస్థాన్

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాదులకు నేతృత్వం వహిస్తున్న మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది బైతుల్లా మెహసూద్‌ను పట్టుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు.

తెహ్రీక్- ఎ- తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్‌ను పట్టుకొని తీరతామని బ్రిటన్‌కు పాక్ ప్రభుత్వం తెలియజేసింది. గత కొన్ని నెలలుగా పాక్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో ఆ దేశ సైన్యం తాలిబాన్ తీవ్రవాదులపై పోరాటం జరుపుతుంది. ఈ పోరులో వందలాది మంది తాలిబాన్ తీవ్రవాదులను సైనికులు హతమార్చారు.

తాలిబాన్ల చీఫ్ మెహసూద్‌ను పట్టుకునేందుకు కూడా పాక్ ఆర్మీ ప్రయత్నాలు చేపట్టింది. మెహసూద్‌ను పట్టుకునే వరకు సైనిక పోరును కొనసాగిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.

తాజాగా సైనిక చర్యపై రెహమాన్ మాలిక్ మాట్లాడుతూ.. మెహసూద్‌పై రూ.50 మిలియన్ల నజరానా ప్రకటించబడి ఉందని తెలిపారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన తీవ్రవాదంపై పోరు, ఇతర భద్రతాపరమైన అంశాల్లో బ్రిటన్, పాక్‌లు సహకరించుకుంటున్నాయని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?