Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో మరో భారతీయుడిపై దాడి

Webdunia
ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కలకలం సృష్టిస్తున్న ఈ దాడులకు కొనసాగింపుగా తాజాగా మెల్‌‍బోర్న్‌లో మరో భారతీయుడిపై దాడి జరిగిన ఘటన తెరపైకి వచ్చింది. భారతీయులపై ఇది ఆరో జాతివివక్ష దాడి కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, బాధ్యులను చట్టం ముందుకు తీసుకొస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో మరో దాడి వెలుగులోకి రావడం గమనార్హం. నగరంలోని కారిక్ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న భారత్‌కు చెందిన ఆశీష్ సూద్‌పై దాడి జరిగినట్లు మంగళవారం తెలిసింది.

నగరంలోని చాపెల్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి పదిహేను మంది సభ్యుల గ్రూపు ఈ యువకుడిపై దాడి చేసింది. ఇతనిపై, మరో ముగ్గురిపై దుండగులు దాడి చేశారు. ఆశీష్‌ను లోహ వస్తువుతో కొట్టినట్లు తెలుస్తోంది.

ఆశీష్‌ను తీవ్ర గాయాలతో పోలీసులు అల్‌ఫెర్డ్ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా చేశారు. అతను తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాడని, అతని ముక్కు నుంచి ఇప్పటికీ రక్తం కారుతున్నట్లు ఆశీష్ స్నేహితుడొకరు సౌత్ ఏషియా టైమ్స్‌కు ఫోన్‌లో చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments