Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్ ఇప్పట్లో స్వదేశానికి తిరిగిరారు

Webdunia
పాకిస్థాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలనకాలంపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు తన పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాల న్యాయబద్ధతను ఈ విచారణలో పరిశీలించనుంది. అయితే ప్రస్తుతం లండన్ విడిచి స్వదేశానికి వెళ్లొద్దని తన సన్నిహితులు సూచించడంతో ముషారఫ్ తన ప్రయాణాన్ని విరమించుకున్నారు.

సుప్రీంకోర్టులో తన తరపున వాదించేందుకు న్యాయమూర్తులతో సంప్రదింపులు కూడా జరిపిన ముషారఫ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముషారఫ్ స్వదేశాగమనం వాయిదా పడటంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ సుప్రీంకోర్టు గతవారం ముషారఫ్‌ను కోర్టు ఎదుట హాజరుకావాలని కోరింది.

2007 లో పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరితోపాటు మొత్తం 60 మంది న్యాయమూర్తులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలకు న్యాయబద్ధతను ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. తన ఈ నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు గత వారం ముషారఫ్‌ను కోరింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?