Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వాళ్లను కొట్టినోడు చాలా మంచోడు: బ్రుంబై

Webdunia
ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుసగా జరుగుతున్న జాతి వివక్ష దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఓ భారత సంతతి ట్యాక్సీడ్రైవర్‌ను ఓ ప్రముఖ ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ ఆటగాడు కొట్టాడు. దీనిపై ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రుంబై మాట్లాడుతూ.. ట్యాక్సీడ్రైవర్‌పై దాడి చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు చాలా మంచోడని కితాబిచ్చిన్నట్లు తెలుస్తోంది.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఆస్ట్రేలియా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు మైకేల్ హర్లే ఓ భారత సంతతి ట్యాక్సీడ్రైవర్‌పై వాదన తరువాత దాడి చేశాడు. దాడి చేసిన సమయంలో మద్యం సేవించి ఉన్న మైకేల్ హర్లే మంచి బాలుడని బ్రుంబై పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మెల్‌బోర్న్‌లోని హడ్లే వీధిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్ వద్ద ట్యాక్సీ‌డ్రైవర్‌పై హర్లే (19) దాడి చేశాడు.

ఈ దాడిలో ట్యాక్సీడ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది జరిగిన ప్రదేశంలోనే ఈ ఫుట్‌బాల్ ఆటగాడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టారు. ఇది జాతి వివక్ష దాడి కాదని, ఛార్జీ దగ్గర వచ్చే పేచీ ఈ పరిణామానికి దారి తీసిందని విక్టోరియా పోలీసులు తెలిపారు. హర్లేపై కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments