Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిగిలే ఉన్న హెచ్1బీ వీసాలు

Webdunia
ఖండాలు, సముద్రాలు దాటి అమెరికాలో వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా భారతీయులకు ఎంతో ఇష్టం. మన భారతీయులు తీవ్రంగా పోటీపడే అమెరికా వీసాల్లో ఈసారి బోలెడు ఖాళీలున్నాయి. హెచ్1బీ వీసాల్లో ఇంకా 20 వేలు మిగిలే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుండగా ఇన్నేసి ఖాళీలు ఉండటం ఇదే తొలిసారి. ఆగస్టు 7 నాటికి హెచ్1బీ వీసాల కోసం 49 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల విభాగం అధికారులు పేర్కొన్నారు.

2010 ఆర్థిక సంవత్సరానికి వీసాల జారీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. తొలి అయిదురోజుల్లో 42 వేల దరఖాస్తులు రాగా, ఆ తర్వాత నెలన్నర కాలంలో కేవలం 7 వేలే వచ్చాయి. నాలుగు నెలలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, ఖాళీలు అలాగే మిగిలిపోయాయి.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయడం, పెద్దమొత్తంలో దరఖాస్తుల్ని తిరస్కరించటం కూడా ఈ పరిస్థితి తలెత్తటానికి కారణమని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments