Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దళాలను పాక్‌కు పంపే ఉద్దేశ్యం లేదు: ఒబామా

Webdunia
స్వాత్ లోయలో పాకిస్తాన్ దళాలకు సహాయంగా అమెరికా తమ సేనలను పంపిస్తుందన్న ఊహాగానాల నేపధ్యంలో, తమకు అటువంటి ఉద్దేశ్యం ఏదీ లేదని బారక్ ఒబామా తేల్చి చెప్పారు.

తాలిబన్లను సమర్థవంతంగా ఎదుర్కొనగల శక్తి పాకిస్తాన్‌కి ఉన్నదనీ, పాక్ దళాలు అత్యంత చాకచక్యంగా పోరు సాగిస్తున్నాయన్నారు. తాలిబన్లపై పాక్ చేస్తున్న దాడి సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

కొందరు అనుకుంటున్నట్లుగా పాక్‌కు సహాయమందించే దిశగా అమెరికా తమ దళాలను పంపిస్తుందన్న వార్తలో నిజం లేదన్నారు. అసలు తమకు అటువంటి ఉద్దేశ్యమేదీ లేదన్నారు.

ఒకవేళ పాక్‌లో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు రుజువైతే అమెరికా సేనలు పాకిస్తాన్‌కు వెళతాయా...? అని ఒక విలేకరి ప్రశ్నించినపుడు ఒబామా స్పందిస్తూ, ఉమ్మడి శత్రువులను తుదముట్టించేందుకు అన్ని దేశాలు ముందుకు వస్తాయన్నారు. అయితే ఆ పోరులో అమాయకులైన ప్రజలు బలికావడానికి తాము సుతారము ఇష్టపడమని ఒబామా తెలియజేశారు.

పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందనీ, పాక్ దళాలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదుల పనిపడుతున్నారని ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments