Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్లాడే కారు రానుంది...!

Webdunia
ఇప్పటివరకు మనం హాలీవుడ్ సినిమాలలో మాట్లాడే కారును చూసాం. కాని ఇప్పుడు అదే మాట్లాడేకారు మార్కెట్లోకి రానుంది. దీనిని రూపొందించిన కర్తలు మన భారతీయులే. వీరు రెండు కార్ల మధ్య మాట్లాడేటటువంటి ఎల్గోరిథమ్‌ను జోడించనున్నామని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్.బీ. శర్మ మరియు డాక్టర్. ఉతేష్ చంద్ర నేతృత్వంలో ఈ మాట్లాడే కారును రూపొందించనున్నారు. ఇది రోబోటిక్ కార్లను సురక్షితమైన విధానంతో లైన్ మార్చే ప్రక్రియకు పూనుకుంటాయి.

తాము రూపొందించే రోబోటిక్ కార్లకు ఎప్పుడు లైన్ కలుపుకోవాలో సూచనలు అందుతాయని డా. శర్మ అన్నారు. దీంతో మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలను ముందుగానే పసిగట్టి డ్రైవర్‌కు సూచనలు ఇస్తాయని ఆయన అన్నారు. ఇంతే కాకుండా ప్రయాణం చేసేటప్పుడు వాహనంయొక్క వేగాన్నికూడా తెలుపుతుందని ఆయన పేర్కొన్నారు.

తాము రూపొందించే ఈ కారులో ఫ్లోకింగ్ రోబోటిక్స్‌లో ప్రయోగించే ఒక ప్రత్యేకమైన బయోలాజికల్ సాంకేతిక తత్వాన్ని ఇందులో పొందుపరచడం ఓ మార్పని ఆయన తెలిపారు. ఫ్లోకింగ్‌ను ఉపయోగించడంమూలాన రోబోట్లు పరస్పరం మాట్లాడుకుంటాయని దీంతో సుదూర ప్రయాణంలో అలసటంటూ రాదని ఆయన తెలిపారు.

రోబోటిక్స్ కార్లన్నికూడా ఎల్గారిథమ్‌తో అనుసంధానమై ఉంటాయని దీంతో కార్ల మధ్య మంచి అవగాహన ఉంటుందని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాల్లో రాణించాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి : హీరో మంచు మనోజ్

పాకిస్థానీ నటి హుమైరా అస్కర్ అలీ అనుమానాస్పద మృతి

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments