Webdunia - Bharat's app for daily news and videos

Install App

భుట్టో హంతకుడు నేరాల్లోనే కాదు చదువులో కూడా టాపే!!

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2011 (15:49 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకేసులోని నిందితుల్లో ఒక నిందితుడు సెకండరీ స్కూల్ ఎగ్జామ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ నిందితుడు రావల్పిండి జైలు నుంచే పరీక్షలు రాశాడు. అబ్దుల్ రషీద్ అహ్మద్ అలియాస్ అబ్దుల్ రహీం తెర్బీ అనే వ్యక్తి 2007లో చోటు జరిగిన బెనజీర్ భుట్టో హత్య కేసులో అరెస్టు చేసిన ఐదుగురు నిందితులుల్లో ఒకడు. ఈ నిందితుడు రావల్పిండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల్లో మొత్తం 1,050 మార్కులకు గాను 848 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షా ఫలితాలను సోమవారం ప్రకటించారు.

ఖైబర్ ఫఖ్తున్ఖావా రాష్ట్రంలోని బటర్గామ్ అనే గ్రామానికి చెందిన అహ్మద్ ప్రస్తుతం మిగిలిన నలుగురు నిందితులతో కలిసి అడియాల జైలులో జీవితం గడుపుతున్నాడు. ఈ నిందితుడు అకోరా ఖట్టక్ అనే మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అహ్మద్‌ను 2008 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని కమ్రాలో చోటు చేసుకున్న తీవ్రవాదుల దాడి కేసులో కూడా అరెస్టు చేశారు.

ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత అహ్మద్ తన చదువును పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడంతో జైలు అధికారులు ఉపాధ్యాయులు, పుస్తకాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చినట్టు అడియాలా జైలు ఎస్పీ మోషిన్ రఫీక్ వెల్లడించారు. అలాగే బెనజీర్ హత్య కేసులో మరో నిందితుడైన అతిజాజ్ షా కూడా ఇస్లామిక్ ఎడ్యుకేషన్‌ విద్యను అభ్యసిస్తూ మూడో స్థానంలో నిలిచాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments