Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పొరుగున మరో అణ్వస్త్ర రాజ్యం?

Webdunia
మయన్మార్ రూపంలో భారత్ పొరుగున మరో అణ్వస్త్ర రాజ్యం అవతరించబోతుందనే అనుమానాలకు ఇటీవల లభించిన ఆధారాలు బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన మయన్మార్ అణు రాజ్యాల సరసన చేరబోతుందనే వార్త చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ, ఇటీవల దొరికిన భారీ సొరంగాల ఛాయాచిత్రాలు, ఓ అత్యున్నత స్థాయి సమావేశం ఈ వాదనలు బలపడుతున్నాయి.

ఉత్తర కొరియా సాయంతో మయన్మార్ అణు రాజ్యంగా అవతరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్‌లో మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్ అణు బాంబు చేతబట్టుకుంటుందని ఎవరూ ఊహించడం లేదు. అయితే అంతర్జాతీయ సమాజం దృష్టి నుంచి ఇప్పుడు మయన్మార్ తప్పించుకునే అవకాశం లేదు. అణ్వాయుధాలు సమకూర్చుకోబోతుందనే అనుమానాల కారణంగా మయన్మార్‌పై కూడా అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టింది.

మయన్మార్‌లో ఈ దిశగా ఏదో జరుగుతుందనే అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఇటీవల ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌక మయన్మార్ బయలుదేరింది. ఈ నౌకలో ఉన్న వస్తువులు వివరాలేవీ ఉత్తర కొరియా వెల్లడించకోపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఈ నౌకను అమెరికా నేవీ వెంబడించడంతో అది తిరిగి ఉత్తర కొరియా వెళ్లిపోయింది. ఈ నౌకలో మయన్మార్ అణు కార్యక్రమానికి సంబంధించిన పరికరాలు, స్కడ్ తరహా క్షిపణులు ఉన్నట్లు ఉపగ్రహ ఛాయచిత్రాలను విశ్లేషించిన కొందరు నిపుణులు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments