Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, చైనా కంటే జపాన్ మిలిటరీ బలహీనం

Webdunia
ప్రపంచంలో రాజకీయంగా, ఆర్థికంగా వేగంగా తమ ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్న భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే జపాన్ మిలిటరీ బలహీనంగా ఉందని ఓ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. జపాన్ రక్షణ విధానాన్ని సమీక్షించిన నిపుణుల కమిటీ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

స్వీయరక్షణ హక్కును కాపాడుకునేందుకు రక్షణ విధానంలో మార్పులు అవసరమని పేర్కొంది. హింసాకాండకు, యుద్ధాలకు దూరంగా ఉండాలని సూచించే జపాన్ రాజ్యాంగంలో స్వీయరక్షణ హక్కు కోసం మార్పు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదే విధంగా ఆయుధాల ఎగుమతిపై నిషేధాన్ని సడలించాలని కూడా సూచించింది.

నిపుణుల కమిటీ ఈ సిఫార్సులతో కూడిన నివేదికను జపాన్ ప్రధాని తారో అసోకి సమర్పించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాంతియుత ఆపరేషన్లలో జపాన్ ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలని ఈ నివేదికలో రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఛైర్మన్ సునెహిసా కట్సుమతా నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ ఈ నివేదికను తయారు చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments