Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దాడులకు లష్కరే గల్ఫ్ సెల్స్ కుట్ర

Webdunia
భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ తన గల్ఫ్ నెట్‌వర్క్ ద్వారా భారీఎత్తున నిధుల సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారత పశ్చిమతీర ప్రాంతంలోని గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో కీలక ప్రదేశాలపై దాడులు చేసేందుకు లష్కరే తోయిబా ప్రయత్నిస్తున్నట్లు భారత నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి భారత నిఘా వ్యవస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన దాడి తరహాలోనే మరిన్ని దాడులు చేసేందుకు లష్కరే తోయిబా తన మెరైన్ విభాగం కుట్ర పన్నుతోందని వర్జీనియాకు చెందిన జేమ్స్‌టౌన్ పౌండేషన్ వెల్లడించిన నివేదిక పేర్కొంది.

భారత్ దాడులకు పశ్చిమతీర ప్రాంతాన్ని లష్కరే తోయిబా ఉపయోగించుకోవాలనుకుంటుందని తెలిపింది. ఇటీవల భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం కూడా దేశ పశ్చిమతీరానికి తీవ్రవాద ముప్పు పొంచివుందని వెల్లడించిన నేపథ్యంలో.. ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిఘా వ్యవస్థలు కూడా భారత్‌లో తీవ్రవాద చర్యలకు గల్ఫ్ సంబంధాలను నిర్ధారిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లోనూ అనేక లష్కరే తోయిబా సెల్స్ పనిచేస్తున్నాయి. భారత్‌పై తీవ్రవాద చర్యలకు గల్ఫ్ ప్రాంతం నుంచి లష్కరే తోయిబా నిధులు సమీకరిస్తోందని నిఘా వ్యవస్థలు కూడా భావిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments