Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దాడులకు అల్‌ఖైదా కుట్ర: సీఐఏ హెచ్చరిక

Webdunia
బుధవారం, 10 మార్చి 2010 (09:41 IST)
అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా భారత్‌పై దాడులకు పాల్పడేందుకు కుట్రపన్నిందని అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ హెచ్చరించింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌ కేంద్రాలుగా చేసుకుని పని చేస్తున్న తీవ్రవాదులపై అల్‌ఖైదా చీఫ్ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు రావడంతో ఈ దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్టు సీఐఏ డైరక్టర్ లియోన్ పనెట్టా తెలిపారు.

అదేసమయంలో తమ మిత్ర దేశాలను ఉగ్రవాదుల దాడి నుంచి కాపాడాల్సిన కనీస బాధ్యత తమపై ఉందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా, భారత్, బ్రిజిల్ వంటి దేశాలతో అమెరికాకు ఉన్న సత్ సంబంధాల దృష్ట్యా తాము ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్టు తెలిపారు.

ఆల్‌ఖైదా, తాలిబన్ అగ్రనేతలను పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో సంకీర్ణ దళాలు వేటాడుతున్నాయి. దీంతో ఆ నేతల నుంచి తీవ్రమైన ఓత్తిళ్ళు వస్తున్నాయి. పాకిస్థాన్ భద్రత దళాల సహకారం వల్లే తాలిబన్ ఉగ్రవాదులను దారికి తెచ్చామని పనెట్టా చెప్పారు. ముల్లా అబ్దుల్ గనీ బర్డర్ వంటి వారిని మట్టుపెట్టామని సిఐఏ డైరెక్టర్ సగర్వంగా ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments