Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను ముప్పుగానే పరిగణిస్తున్న పాకిస్థాన్

Webdunia
పాకిస్థాన్‌కు నిజమైన ముప్పు భారత్ కాదని, తాలిబాన్ తీవ్రవాదులని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చెబుతున్నారు. అయితే పాకిస్థాన్ ఆర్మీ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయం కలిగివుంది. పాకిస్థాన్ ఆర్మీ ఇప్పటికీ భారత్‌ను ముప్పుగానే పరిగణిస్తుందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ భారత్, అంతర్గత తీవ్రవాదం రెండింటిని దేశానికి ముప్పుగా పరిగణిస్తున్నారని చెప్పారు. ఈ రెండింటిపైనా పాకిస్థాన్ ఆర్మీ దృష్టిసారించి ఉందని వెల్లడించారు. ఈ రెండు రకాల ముప్పులను ఎదుర్కోవడానికి పాక్ ఆర్మీ ప్రయత్నిస్తుందన్నారు.

ఏడాది క్రితంతో పోలిస్తే పాకిస్థాన్ ఆర్మీ ఇప్పుడు తీవ్రవాదం విషయంలో చురుగ్గా పనిచేస్తుందని ముల్లెన్ తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలోని సమస్యాత్మక వాయువ్య ప్రావీన్స్‌లో సైనిక చర్యను ముమ్మరం చేసిన సందర్భంగా పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం భారత్ కంటే తాలిబాన్లనే దేశనికి పెద్ద ముప్పుగా భావిస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments