Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో బుల్లెట్ ప్రూఫ్ ఆసుపత్రులు!

Webdunia
మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ కారణంగా జరిగే మారణ హోమాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం రియో డీ జెనేరియోలోని ఐదు ఆసుపత్రులను బుల్లెట్ ప్రూఫ్‌ ఆసుపత్రులుగా తయారు చేయనున్నారు.

ప్రమాదకరమైన ప్రాంతాలలోనున్న ఈ ఆసుపత్రులలోని భవంతులకు నలువైపులా కాంక్రీట్‌తో కాంపౌండ్‌వాల్ కట్టి కిటికీలకు ఇనుప షట్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇవి తుపాకీ గుండ్లను నిరోధించేవిధంగా ఉంటాయని వారు అన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆసుపత్రుల ప్రాంతీయ డైరెక్టర్ ఆస్కార్ బేరో అన్నారు. ఆసుపత్రుల పునర్నిర్మాణం చేసేందుకు తాము దాదాపు 25 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల బయటి వ్యక్తులు గత వారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిపై జరిపిన కాల్పుల్లో ఆసుపత్రిలోని ఎక్స్‌రే స్లైడ్‌లకోసం ఉపయోగించే ఓ యంత్రం పాడైపోయిందని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments