Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేనజీర్ భుట్టో హత్యా స్థలంలో ఐరాస బృందం

Webdunia
ఐక్యరాజ్యసమితి సాంకేతిక కమిటీకి చెందిన ఇద్దరు సభ్యులు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. 2007 డిసెంబరులో రావల్పిండిలో జరిగిన ఉగ్రవాద దాడిలో బేనజీర్ భుట్టో హత్యకు గురైన సంగతి తెలిసిందే. భుట్టో హత్యపై దర్యాప్తును పాకిస్థాన్ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఐరాస చేపట్టింది.

భుట్టో హత్యపై దర్యాప్తు జరిపే ఐక్యరాజ్యసమితి అధికార కమిటీ పాకిస్థాన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. భుట్టో హత్యపై దర్యాప్తుకు ఇటీవల ఏర్పాటయిన ఐరాస కమిటీ త్వరలో హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించనుందని పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. రావల్పిండిలోని లియాక్వాట్ బాగ్ వద్ద భుట్టో హత్య జరిగింది.

ఈ ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాజాగా ఇద్దరు ఐరాస అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. భుట్టో హత్యకు గత వాస్తవ కారణాలు, అందుకు దారితీసిన పరిస్థితులపై ఐరాస ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు జరుపుతుంది. దీని కోసం ఈ కమిటీ సభ్యులు త్వరలోనే పెషావర్‌లో పర్యటించనున్నారు.

తాజాగా ఇక్కడ పర్యటించిన ఐరాస అధికారులు భుట్టో హత్యకు గురైన ప్రదేశం ఛాయాచిత్రాలు తీసుకున్నారు. అంతేకాకుండా ఊహాచిత్రాలు తయారు చేసుకున్నాడు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బేనజీర్ చివరిసారి ప్రసంగించిన వేదికను కూడా ఐరాస అధికారులు పరిశీలించారని మీడియా కథనాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?