Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుష్‌పై బూటు విసిరిన విలేకరి విడుదల వాయిదా

Webdunia
నిరుడు డిసెంబర్ 14న అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌పై బూటు విసిరిన ఇరాక్ విలేకరి ముంతజర్ అల్-జియాదీ విడుదల మంగళవారానికి వాయిదా పడింది.

ఇరాక్‌లోని ఓ ప్రైవేట్ మీడియా విలేకరి ముంతజర్ అల్-జియాదీ గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌పై బూటు విసిరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడి న్యాయస్థానం అతనికి మూడు సంవత్సరాలపాటు కారాగార శిక్ష విధించింది. దీంతో ఆ దేశాధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాధించడంతో అతనిని సోమవారం( 14.09.09)నాడు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది.

కాని అతనిపై ఇంకా న్యాయపరమైన చిక్కులు ఉండటం మూలాన మరో రోజు జైలులోనే ఉంచాలని జైలు అధికారులు తెలిపినట్లు జియాదీ సోదరుడు దుర్గమ్ తెలిపారు. అతను స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి మరో ఇరవై నాలుగు గంటలు పడుతుందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. జైలు అధికారులు మంగళవారం విడుదల చేస్తారని జియాదీకి చెప్పినట్లు అతని సోదరుడు చెప్పాడు.

ఇదిలావుండగా జియాదీకి ఇచ్చిన శిక్షా కాలపరిమితి ముగిసింది. కాని కొన్ని న్యాయపరమైన చిక్కులుండటం వలన, అతనిని విడుదల చేసేందుకు కావలసిన కాగితాలపై సంతకాల సేకరణా కార్యక్రమం ఉంది కాబట్టి అతనిని మరో రోజు కస్టడీలో ఉంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

కాగా విదేశీ అధ్యక్షునిపై బూటుతో దాడి చేయడం కారణంగా అతనికి మూడు సంవత్సరాల శిక్ష పడింది. కాని ఇరాక్ దేశాధ్యక్షుడు అతనికి క్షమాభిక్ష ప్రసాదించడంతో శిక్షను తగ్గించి సోమవారంనాడు విడుదల చేయాల్సి ఉంది. దీంతోపాటు అతని సత్ప్రవర్తన వలన అతనిని త్వరలోనే విడుదల చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇరాక్‌లోని సెంట్రల్ బాగ్దాద్ వద్ద జియాదీ రాకకై రంగురంగుల బెలూన్లు, బ్యానర్‌లు, ప్లకార్డులను ఏర్పాటుచేసి అతనికి స్వాగతం చెప్పేందుకు అతని ముగ్గురు సోదరీమణులతోపాటు మరికొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని అక్కడి వార్తా ఛానల్ పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments