Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలూచిస్తాన్‌పై ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు

Webdunia
తమ దేశంలోని బలూచిస్థాన్ ప్రాంతంలో అశాంతి నెలకొనడంలో భారత్ పాత్ర ఉందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను తాము ఇప్పటికే భారత్, అమెరికా దేశాలతో పంచుకున్నట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం చెప్పినట్లు ఆ దేశ మీడియా ఇటీవల సంచలనాత్మక కథనాలు వెల్లడించింది.

ఇదిలా ఉంటే బలూచిస్థాన్‌లో భారత్ పాత్ర నిరూపించే ఆధారాలనేవీ పాకిస్థాన్ ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హోల్‌బ్రూక్ స్పష్టం చేశారు. హోల్‌‍బ్రూక్ గురువారం మాట్లాడుతూ.. బలూచిస్థాన్ ప్రాంతంలో భారత ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలను నిరూపించే విశ్వసనీయ ఆధారాలేవీ తమకు అందలేదన్నారు.

ఇటీవల పాకిస్థాన్ నేతలతో తన సమావేశం సందర్భంగా బలూచిస్థాన్‌లో భారత పాత్ర ఉందనే ఆరోపణలు కూడా చర్చకు వచ్చాయని హోల్‌బ్రూక్ తెలిపారు. ఈ అంశం చర్చల్లో ఉందని, అయితే దీనికి సంబంధించి పాకిస్థాన్ ఎటువంటి ఆధారాలు అందజేయలేదని హోల్‌బ్రూక్ తెలిపారు. దీనిని వివరంగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments