Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ స్థాయిలో భారత్ కీలకపాత్ర: హిల్లరీ

Webdunia
రష్యా, చైనా, టర్కీ, భారత్‌లు కీలకమైన అంతర్జాతీయ శక్తులుగా ఎదుగుతున్నాయని అమెరికా గుర్తించింది. వాతావరణ మార్పులు, తీవ్రవాదం, ఆర్థిక మాంద్యం, నిరాయుధీకరణ వంటి కీలక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో అమెరికా ఈ దేశాలతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని అమెరికా కోరుకుంటోంది.

చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి ప్రధాన, వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ శక్తులపై అమెరికా ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ దేశాలతో అమెరికా పూర్తి భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటుందని చెప్పారు.

తాను వ్యక్తిగతంగా ఇందుకు కట్టుబడి పనిచేస్తానని, దీనికి సంబంధించిన ప్రక్రియకు ప్రాముఖ్యత కల్పించాలనుకుంటున్నట్లు హిల్లరీ తెలిపారు. అంతర్జాతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కీలక సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ఈ దేశాల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ శుక్రవారం నుంచి భారత్, థాయ్‌లాండ్ దేశాల్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments