Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగు దేశాలపై దాడులను పాక్ అడ్డుకోవాలి

Webdunia
పొరుగు దేశాలపై దాడులకు పాకిస్థాన్ భూభాగం ఉపయోగపడకుండా ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమెరికా సెనెట్ దక్షిణాసియా విభాగ మాజీ సలహాదారు లిసా కర్టిస్ కోరారు. ఇతర దేశాలపై దాడులకు పాక్ గడ్డపై తీవ్రవాదులు తెగబడకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

పాకిస్థాన్ భూభాగంలో తీవ్రవాద మూకలకు కళ్లెం వేసేందుకు ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలపైనే దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అమెరికా కాంగ్రెస్ కమిటీని ఉద్దేశించి కర్టిస్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత భవిష్యత్, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై జరుపుతున్న యుద్ధ ఫలితం పాకిస్థాన్ ప్రభుత్వం వారి దేశంలో తీవ్రవాదంపై పోరుకు చూపే చొరవపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.

భారత్- పాకిస్థాన్ మధ్య శాంతి ప్రక్రియకు ఆమె మద్దతు పలికారు. దశాబ్దాల కాశ్మీర్ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు ఇరుదేశాలు శాంతి ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాసియా ప్రాంతంలో తీవ్రవాదంపై జరుపుతున్న పోరులో విజయం అమెరికా- పాకిస్థాన్ మధ్య పరస్పర సహకారంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Show comments