Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు మాజీ అధ్యక్షుడికి 7.5 ఏళ్ల జైలుశిక్ష

Webdunia
పెరు సుప్రీంకోర్టు సోమవారం ఆ దేశ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరికి ఓ అవినీతి కేసులో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఫుజిమొరి తన గూఢచర్య విభాగాధిపతికి 15 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసులో ఫుజిమొరిని సుప్రీంకోర్టు దోషిగా పరిగణించి 7.5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

2007 లో ప్రవాసం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఫుజిమొరికి కోర్టు శిక్ష విధించడం ఇది మూడోసారి. 1990 నుంచి 2000 వరకు దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశానికి ఫుజిమొరి అధ్యక్షుడిగా పనిచేశారు.

నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫుజిమొరి తాజా కేసులో మాజీ సహాయకుడు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ వ్లాదిమిరో మోటెసినోస్‌కు అక్రమంగా 15 మిలియన్ డాలర్ల బోనస్ చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయ్యాయి. పెరు సుప్రీంకోర్టు ఆయనకు సోమవారం అంతర్జాతీయ కాలమానం ప్రకారం 1700 గంటల సమయంలో ఏడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments