Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో ముషారఫ్ భవితవ్యం: పాక్ ప్రధాని

Webdunia
మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భవితవ్యాన్ని పార్లమెంట్ తేల్చుతుందని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ చెప్పారు. ముషారఫ్ సైనిక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో ఎమెర్జెన్సీ విధించారు. దీనిపై దాఖలైన పిటీషన్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దేశంలో ఎమర్జెన్సీ విధించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసులను సైతం ముషారఫ్ ధిక్కరించారు.

దీంతో ముష్ భవితవ్యం కష్టకాలంలో పడింది. ఈ అంశంపై పాక్ ప్రధాని గిలానీ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై ఆది నుంచి తాను ఒకే మాట చెపుతున్నాను. పార్లమెంటే ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించేందుకు గిలానీ నిరాకరించారు.

తమ పార్టీకి ఒక సిద్ధాంతమంటూ ఉంది. దేశంలో నియంత పరిపాలనకు తమ పార్టీ మద్దతు తెలుపదన్నారు. అలాగే, అధ్యక్షుడు జర్దారీకి తనకు మధ్య విభేదాలు ఉన్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను గిలానీ తోసిపుచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments