Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ వాయువ్య ప్రాంతంలో పేలుళ్ళు: 20 మంది మృతి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2009 (20:32 IST)
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని ఛర్స్ అడ్డా పట్టణంలో మంగళవారం భారీ పేలుడు సంభవించడంతో 20 మంది మృతి చెందారు.

పాకిస్థాన్ దేశంలోని వాయువ్య ప్రాంతంలోనున్ న ఛర్స్ అడ్డా పట్టణంలోని రద్దీ ఎక్కువగానున్న వ్యాపార కూడలి ఫరూక్-ఏ-ఆజమ్ చౌక్ వద్ద మంగళవారం సాయంత్రం గం. 4.20లకు భారీ పేలుడు సంభవించిందని, ఈ పేలుడు కారణంగా 20 మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

పేలుడు జరిగిన సందర్భంలో రద్దీ ఎక్కువగా ఉండిందని, ఇందులో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో దేశవ్యాప్తంగా తాలిబన్ ఉగ్రవాదులపై నిఘా మరింత తీవ్రతరం చేశారని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

ఈ పేలుడు కారణంగా చాలా దుకాణాలు, కార్లు, ఇతర వాహనాలతోపాటు ఓ ఛానెల్‌కు చెందిన కార్యాలయం కూడా దెబ్బతిందని స్థానిక మీడియా తెలిపింది.

తీవ్ర గాయాలపాలైన వారిలో అత్యధికులు పాఠశాల విద్యార్థులున్నారని, గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

పేలుడు ఎక్కడ సంభవించిందనేది స్పష్టంగా చెప్పలేమని, బహుశా అది కారు బాంబు అయి వుండవచ్చని తాము అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments