Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాకు సరిగా సహకరించడంలేదు: యూఎస్

Webdunia
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై తాము చేపట్టిన తాజా ఆపరేషన్‌లో పాకిస్థాన్ తమకు సరిగా సహకరించడం లేదని అమెరికా కమాండర్ ఒకరు పేర్కొన్నారు. తాలిబాన్లపై తాము తాజాగా చేపట్టిన పోరులో పాకిస్థాన్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైనిక కమాండర్‌గా పనిచేస్తున్న జనరల్ స్టాన్లీ మెక్‌క్రిస్టల్ తెలిపారు.

ఈ కారణంగా తాజా సైనిక ఆపరేషన్‌లలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మెక్‌క్రిస్టల్ ఈ విషయమే గత వారంతంలో రహస్యంగా ఇస్లామాబాద్ వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీలతో మెక్‌క్రిస్టల్ ఈ రహస్య పర్యటనలో భేటీ అయినట్లు సమాచారం.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై ఇటీవల కాలంలో ముమ్మరం చేసిన సైనిక చర్యలపై మెక్‌క్రిస్టల్ ఈ పర్యటనలో చర్చలు జరిపారు. మెక్‌క్రిస్టల్‌తోపాటు ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దౌత్యాధికారి లెప్టినెంట్ జనరల్ కార్ల్ ఎకెన్‌బెర్రీ కూడా పాక్ పర్యనటకు వెళ్లినట్లు తెలిసింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తాలిబాన్లపై జరుపుతున్న పోరులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ పర్యటనలో అమెరికా అధికారులు పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments