Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో ఆత్మాహుతి దాడులు: 16 మంది మృతి

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రావీన్స్‌లో వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 16 మంది మృతి చెందారు. ఈ దాడుల్లో మరో 150 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. తమపై దాడులు కొనసాగిస్తే, మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తామని తాలిబాన్లు ముందురోజు హెచ్చరించడం, ఈ హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే రెండు ఆత్మాహుతి దాడులు జరగడంతో ఈ ప్రాంత పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో శనివారం మరో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పాక్ భూభాగం పూర్తిగా పర్వతాలతో నిండివుంది. ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలన ఉండదు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి అతికొద్ది పట్టు మాత్రమే ఉంది. ఇక్కడి భౌగోళిక సామాజిక పరిస్థితులను ఆసరగా చేసుకొని తీవ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్థాన్‌లోని నాటో, అమెరికా దళాలు, అదే విధంగా పాకిస్థాన్ భద్రతా దళాలు, ఇతర అధికారులను లక్ష్యంగా చే్సుకొని దాడులకు పాల్పడుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments