Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో అమెరికా డ్రోన్ దాడి: ఐదుగురి మృతి

Webdunia
పాకిస్థాన్‌లో అమెరికా మానవరహిత యుద్ధ విమానం (డ్రోన్) జరిపిన దాడిలో ఐదుగురు తీవ్రవాదులు మృతి చెందారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా డ్రోన్‌లు క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఆర్మీ కూడా ఈ ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతోంది. పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ వాలీ అలియాస్ మలాంగ్ నజీర్ స్థావరంతోపాటు, రెండు వేర్వేరు ప్రదేశాల్లో అమెరికా డ్రోన్ దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాద దాడులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబాన్ నేత ముల్లా నజీర్‌కు ఆధిపత్యంలోని ప్రాంతాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసిందని చెప్పారు. షా అలంలోని మదర్సా, షా ఆలం నివాసంపై అమెరికా డ్రోన్ మూడు క్షిపణులు ప్రయోగించింది. దాడి జరిగిన ప్రాంతం దక్షిణ వజీరిస్థాన్ ఏజెన్సీలో ప్రధాన పట్టణమైన వానాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments