Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు పౌర సాయం పెంచే బిల్లుకు ఆమోదం

Webdunia
పాకిస్థాన్‌కు పౌర సాయాన్ని భారీగా పెంచే కెర్రీ- లూగర్ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ద్వారా పాకిస్థాన్‌కు అమెరికా ప్రభుత్వం అందజేసే పౌర సాయాన్ని మూడురెట్లు పెంచనున్నారు. వచ్చే ఐదేళ్లకాలంలో అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు 7.5 బిలియన్ డాలర్ల పౌర సాయాన్ని అందజేయనుంది.

ఇదేవిధంగా వచ్చే పదేళ్ల కాలంలో పాకిస్థాన్‌‍కు 15 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఈ బిల్లులో అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఏకగ్రీవ ఆమోదం లభించింది. కెర్రీ- లూగర్ బిల్లుకు సెనెట్‌లో ఇరుపార్టీల (రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) మద్దతు లభించింది. ఇదిలా ఉంటే అంతకుముందు ప్రతినిధుల సభ జూన్ 11న పాక్ ఆర్థిక సాయానికి సంబంధించి ఆమోదించిన బిల్లులో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి.

ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన బిల్లు పాకిస్థాన్‌కు ఆర్థిక సాయాన్ని తీవ్రవాదంపై పోరుతో ముడిపెట్టాలని సూచిస్తోంది. ఈ కఠిన నిబంధనలు పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రవాదంపై జరుపుతున్న పోరుకు ఆటంకం కలిగిస్తాయని బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments