Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో నార్వే దౌత్యకార్యాలయం మూసివేత

Webdunia
పాకిస్థాన్‌లో నార్వే ప్రభుత్వం తన దౌత్యకార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దౌత్యకార్యాలయానికి బెదిరింపులు రావడంతో, భద్రతాపరమైన కారణాలతో నార్వే ప్రభుత్వం తమ దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు గురువారం వెల్లడించాయి.

కొన్నిరోజుల క్రితం ఇస్లామాబాద్‌లోని నార్వే దౌత్యకార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై పాకిస్థాన్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఇస్లామాబాద్‌లో రద్దీగా ఉండే ఓ మార్కెట్ సమీపంలోని నివాస ప్రాంతంలో నార్వే దౌత్యకార్యాలయం ఉంది. బెదిరింపుల నేపథ్యంలో శుక్రవారం వరకు దౌత్యకార్యాలయాన్ని మూసివేశారు.

సాధారణ భద్రతా పరిస్థితులు, వచ్చిన బెదిరింపులను పరిగణలోకి తీసుకొని తమ దౌత్యకార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు నార్వే విదేశాంగ శాఖ తెలిపింది. బెదిరింపుల నేపథ్యంలో ఇటీవల నార్వే దౌత్యకార్యాలయాన్ని ఇస్లామాబాద్ ఐజీపీ సయద్ కలీమ్ ఇమామ్ కూడా సందర్శించారు.

ఇదిలా ఉంటే నార్వే దౌత్యకార్యాలయం మూసివేతపై తమకు ఎటువంటి సమాచారం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిసిందే. దీనికి సంబంధించిన పరిణామాలేవీ తమ దృష్టికి రాలేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ బసిత్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments