Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు ఇప్పుడు అమెరికానే పెద్ద శత్రువు

Webdunia
పాకిస్థాన్ మొదటి శత్రువు పాత్రను ఇప్పుడు అమెరికా స్వీకరించింది. పాకిస్థానీయులు భారత్ కంటే ఇప్పుడు అమెరికానే పెద్ద ముప్పుగా పరిగణిస్తున్నట్లు ఓ కొత్త సర్వేలో తేలింది. పాకిస్థానీయులు నిన్నమొన్నటి వరకు భారత్‌ను వారి మొదటి శత్రువుగా భావించేవారు. అయితే వారి ఆలోచనా ధోరణి ఇప్పుడు మారింది.

ప్రస్తుతం పాకిస్థానీయులు అమెరికాను తమ మొదటి శత్రువుగా భావిస్తున్నట్లు ఖతర్‌కు చెందిన అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జులై చివరి వారంలో అల్ జజీరా ఛానల్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 2662 మంది పాకిస్థానీయులు పాల్గొన్నారు.

పాకిస్థాన్‌లోని నాలుగు ప్రావీన్స్‌ల్లో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ పౌరుల అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతం 18 శాతం మంది పాకిస్థానీయులు మాత్రమే భారత్‌ను ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నారు. 59 శాతం మంది అమెరికా నుంచి తమకు ముప్పు పొంచివుందని భావిస్తున్నారు.

ఇదే గాలప్ సర్వే 2004లో నిర్వహించగా, 72 శాతం మంది పాకిస్థానీయులు భారత్‌ను ప్రధాన శత్రువుగా భావిస్తున్నట్లు తెలింది. అమెరికాకు చెందిన సీఐఏ జరుపుతున్న డ్రోన్ దాడుల కారణంగా పాకిస్థానీయుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments