Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ ఆర్మీ చీఫ్ తొలగింపు ఆదేశాలు రద్దు

Webdunia
నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మంత్రివర్గం శుక్రవారం ఆ దేశ ఆర్మీ చీఫ్ కతావల్‌ను తొలగిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను రద్దు చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ రూక్మాంగుడ్ కతావల్‌ను తొలగించేందుకు నేపాల్‌లో ఇంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ప్రచండ నేతృత్వంలోని మావోయిస్టు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేపాల్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. కతావల్ తొలగింపు నిర్ణయాన్ని ఆ వెంటనే నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ అడ్డుకున్నారు. అనంతర పరిణామాలు నేపాల్ తొలి మావోయిస్టు ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీశాయి.

ఆపై మాధవ్ కుమార్ నేపాల్ నేతృత్వంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. తాజాగా మాధవ్ కుమార్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ తొలగింపు కోసం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ తొలగింపును అధ్యక్షుడు అడ్డుకోవడాన్ని ఖండించాలని ప్రచండ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రద్దు చేశామని నేపాల్ సమాచార శాఖ మంత్రి శంకర్ పఖరేల్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments