Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో దేవాలయం కూలి 24 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2009 (12:36 IST)
నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన భక్తులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. నేపాల్‌లోని సన్‌సూరి జిల్లాలో ఈ ఘోరం సంభవించింది. భక్తులతో నిండివున్న ఆలయం ఒకటి కూలిపోగా, ఈ దుర్ఘటనలో 24 మంది భక్తులు మృత్యువాత పడినట్టు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి.

దారణ్ అనే ప్రాంతంలోని ఒక ఆలయంలో మంగళవారం ఓ వర్గానికి చెందిన కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రార్థనలకు సుమారు 1500 మందికి పైగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆలయంలోని ఓ భాగం కూలిపోయిందని పోలీసులు తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకున్న భక్తుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, 17 మంది మహిళలు సైతం ఉన్నారు. నీరూరాయ్ అనే 35 సంవత్సరాల భారత సంతతి మహిళ కూడా ఉన్నారు. కాగా, ఈ ప్రమాదంలో మరో 62 మందికి పైగా గాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments