Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ వైపు కామెరాన్ అడుగులు

Webdunia
శుక్రవారం, 7 మే 2010 (15:02 IST)
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏమాత్రం తీసిపోలేదు. ఈ సర్వేలు వెల్లడించినట్టుగానే బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్ ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి కన్జర్వేటివ్ నేత డేవిడ్ కామెరాన్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ వైపు అడుగులు వేస్తున్నారు.

కాగా, బ్రిటన్‌లో 92 సంవత్సరాల తర్వాత భారత్ తరహా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ఫలితాల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, మొత్తం 649 సీట్లకు గాను 600 స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఇందులో కన్జర్వేటివ్ పార్టీ 287 సీట్లు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత స్థానంలో అధికార లేబర్ పార్టీ 237 సీట్లు దక్కాయి.

లిబెరల్ డెమొక్రటిక్ పార్టీ 51 సీట్లు కేవసం చేసుకోగా, స్వతంత్రులు, ఇతర పార్టీలు కలిసి 27 స్థానాల్లో విజయం సాధించాయి. కాగా, బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ప్రధాని గోర్డెన్ బ్రౌన్‌కు కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. అయితే, ఈయన హౌస్ ఆఫ్ కమ్మన్స్‌లో బలాన్ని నిరూపించుకోలేక పోతే కామెరాన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments