Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ కుమారుని రిసెప్షన్‌‌కు పాక్ ఐఎస్ఐ అధికారులు

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2011 (11:49 IST)
అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్ ఎప్పటి నుంచో కృషి చేస్తోంది. అయితే ఈ అండర్ వరల్డ్‌కు దాయాది దేశం పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిన విషయం జగమెరిగిన రహస్యం. కానీ, పాక్ మాత్రం దావూద్ తమ గడ్డపై లేరని ఒక్క భారత్‌ను మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజాన్ని సైతం మోసం చేస్తోంది.

ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన దావూద్ ఇబ్రహీం కుమారుడు మియాన్ నవాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు పాకిస్థాన్ నిఘా వర్గానికి చెందిన ఉన్నతాధికారులు హాజరైనట్టు భారత నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి.

ఐఎస్ఐ విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూపు, జాయింట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ వింగ్‌లకు చెందిన అధికారులు హాజరైనట్టు సమాచారం. ఇందులో ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ వింగ్‌లో కల్నల్ రెహ్మాన్ రషీద్, లెఫ్టినెంట్ రషీదుల్లా ఖాన్‌లతో సహా పాకిస్థాన్ రేంజర్లు లెఫ్టినెంట్ కల్నల్ షౌజా ఉల్ పాషా, లెఫ్టినెంట్ కల్నల్ అసిదుర్ రెహ్మాన్‌లు కూడా హాజరయ్యారని స్థానిక కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ రిసెప్షన్ వేడుకకు దావూద్ అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో జరిగింది. ఇది ఓడరేవు పట్టణమైన కరాచీలో హైసెక్యూరిటీ జోన్ మధ్య నిర్మితమైవుంది. ఈ హౌస్‌ను దావూద్ సన్నిహితులు క్లిఫ్టాన్ అని కూడా పిలుస్తుంటారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments