Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

Webdunia
న్యూజిలాండ్ దక్షిణ ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూజిలాండ్ నైరుతీ అంచున భారీ భూకంపం సంభవించింది.

ఇన్వెర్‌కార్గిల్‌కు పశ్చిమంగా 161 కిలోమీటర్ల దూరంలో 33 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపానికి సంబంధించిన ఇతర వివరాలేవీ తెలియరాలేదు. భూకంపం కారణంగా ఫసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు.

ఇదిలా ఉంటే గత నెలలో న్యూజిలాండ్ ఉత్తర ద్వీపం మధ్య భాగంలో 13 గంటల వ్యవధిలో వరుసగా ఎనిమిది భూకంపాలు సంభవించాయి. న్యూజిలాండ్‌లో ప్రతిఏటా సాధారణంగా 10 వేల నుంచి 15 వేల వరకు భూకంపాలు సంభవిస్తుంటాయి. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం 1855లో సంభవించింది. వైరారపాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 8.2గా నమోదయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments