Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదులు లబ్ది పొందుతారు: గిలానీ హెచ్చరిక

Webdunia
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ గత వారం రోజుల్లో రెండోసారి ఉపఖండ చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్- పాక్ మధ్య శాంతి ప్రక్రియ చర్చలను పునరుద్ధరించాలని, కాశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపాలని శుక్రవారం గిలానీ పునరుద్ఘాటించారు.

ఇరుదేశాల మధ్య చర్చల విషయంలో అనిశ్చితి నెలకొనడం ద్వారా తీవ్రవాదుల లబ్ది పొందే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్- పాక్ మధ్య విభేదాలు తీవ్రవాదులకు అవకాశం కల్పిస్తాయని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

శాంతి ప్రక్రియ నిలిచిపోవడం ద్వారా తీవ్రవాదులే ప్రయోజనం పొందుతారని ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీలో గిలానీ వ్యాఖ్యానించారు.

శాంతి ప్రక్రియ చర్చలు నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు. గత ఏడాది జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్ తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉందని బలంగా విశ్వసిస్తున్న భారత్ ఆ సమయంలోనే శాంతి ప్రక్రియ చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments