Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదంపై పోరుకు బలూచిస్థాన్‌తో ముడి

Webdunia
భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రుల మధ్య ఈజిప్టులో జరిగిన సమావేశంలో బలూచిస్థాన్ సమస్య చర్చకు వచ్చిన కొన్ని రోజుల తరువాత మరోసారి ఈ ప్రాంతం వార్తల్లోకెక్కింది. ఈజిప్టులో జరిగే సమావేశం సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో బలూచిస్థాన్ అంశాన్ని కూడా ప్రస్తావించారు.

అనంతరం పాకిస్థాన్‌లోని సమస్యాత్మక బలూచిస్థాన్‌లో భారత్ జోక్యం ఉందంటూ గిలానీ యంత్రాంగం ఇప్పటికీ ప్రచారం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ కూడా తీవ్రవాదంపై పోరుకు, బలూచిస్థాన్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాము తీవ్రవాదంపై చర్యలు తీసుకునేందుకు భారత్ చేత బలూచిస్థాన్‌లో రహస్య కార్యకలాపాలు నిలిపివేయించాలని కయానీ భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కయానీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యంత్రాంగంతో మాట్లాడుతున్న సందర్భంగా పాకిస్థాన్ తీవ్రవాదంపై తీసుకున్న చర్యలకు, బలూచిస్థాన్‌లో స్థిరత్వానికి ముడిపెట్టే ప్రయత్నం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments