Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదంపై చర్చలు జరపనున్న భారత్, పాక్

Webdunia
గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తొలిసారి అత్యున్నత స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇరుదేశాల అధినేతలు రష్యా పర్యటనలో భాగంగా కలుసుకోబోతున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కలుసుకోనున్నారు.

ఈ సందర్భంగా తీవ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంది. రెండు అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు మూడు రోజుల విదేశీ పర్యటన చేపట్టిన మన్మోహన్ సింగ్- పాక్ అధ్యక్షుడి మధ్య జరిగే సమావేశంలో తీవ్రవాదమే ప్రధానాంశం కానుంది.

పాకిస్థాన్ గడ్డపై తీవ్రవాద మౌలిక సదుపాయాలని ధ్వంసం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేయనున్నారు. రష్యాలో జరిగే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సుకు మన్మోహన్ సింగ్, జర్దారీ హాజరవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments