Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబాన్ స్థావరాలపై పాక్ వైమానిక దాడులు

Webdunia
పాకిస్థాన్ యుద్ధ విమానాలు సోమవారం తాలిబాన్ తీవ్రవాదులకు గట్టిపట్టు ఉన్న ప్రాంతాలపై దాడులు చేశాయి. సమస్యాత్మక దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో తాలిబాన్ తీవ్రవాదుల ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో వారితో పోరాడుతున్న పాకిస్థాన్ సైన్యం తాజాగా వైమానిక దాడులు జరిపింది.

ఇదిలా ఉంటే వాయువ్య ప్రావీన్స్‌లోని స్వాత్ లోయలో పాకిస్థాన్ సైనికులు, తాలిబాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 14 మంది తీవ్రవాదులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు దక్షిణ వజీరిస్థాన్‌లోని లఢా ప్రాంతంలో పాకిస్థాన్ యుద్ధ విమానాలు తాలిబాన్ స్థావరాలపై దాడులు చేశాయి.

ఈ ప్రాంతంపై తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్‌కు గట్టిపట్టు ఉంది. వైమానిక దాడుల్లో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారమేదీ లేదు. మెహసూద్‌ను పట్టుకునేందుకు, అతని నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు తుది పోరుకు రంగం సిద్ధం చేస్తున్నామని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది.

స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులతో జరుగుతున్న పోరు చివరి దశలో ఉందని అధికారులు తెలిపారు. తాజాగా తిలిగ్రామ్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 14 మంది తీవ్రవాదులు మృతి చెందారు. అనంతరం భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments