Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిపోతున్న అమెరికా అధినేత ఒబామా ఆదరణ!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2009 (11:10 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదరణ రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో విపరీతమైన ప్రజాకర్షణ నేతగా ఉన్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఆయన ప్రజాధారణ 47 శాతానికి పడిపోయినట్టు గ్యాలప్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వానికి ఇంత తక్కువ రేటింగ్‌ లభించలేదని ఈ సర్వే పేర్కొంది. నవంబర్‌ మధ్య నుంచి ఒబామా రేటింగ్స్‌ 50 శాతానికి తక్కువగానే ఉంటున్న విషయం తెల్సిందే.

అయితే ఒబామా తాజాగా ఆఫ్ఘన్‌-పాకిస్థాన్ దేశాల్లో తమ ప్రభుత్వం అనుసరించనున్న కొత్త విధాన ప్రణాళికను ప్రకటించారు. ఆ సమయంలో ఒబామా ఆదరణ గతవారం 52కు పెరిగినట్లు గ్యాలప్‌ పోల్‌ తెలిపింది. ఈ నెల నాలుగు, ఆరు తేదీల మధ్య జరిగిన సర్వేలో ఆయన రేటింగ్స్‌ 47 శాతానికి పడిపోయాయి.

అయితే, డిసెంబరులో ఈ రేటింగ్ 52 శాతం మేరకు పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. గతంలో కూడా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ (49 శాతం), బిల్‌ క్లింటన్‌ (53 శాతం) రేటింగ్స్‌ కూడా డిసెంబర్‌లో సగటున ఇలాగే ఉన్నాయని ఆ సర్వే తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments