Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 26- ఆగస్టు 19 మధ్య ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం

Webdunia
ఇరాన్‌లో వచ్చే నెల 26 నుంచి కొత్త ప్రభుత్వం కొలువుతీరే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ జులై 26 నుంచి ఆగస్టు 19 వరకు జరుగుతుంది. ఇటీవల ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ తిరిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అహ్మదీనెజాద్ ఇరాన్ అధ్యక్ష పగ్గాలు వరుసగా రెండోసారి చేపట్టబోతున్నారు.

అహ్మదీనెజాద్, ఆయన కొత్త మంత్రివర్గం పార్లమెంట్‌లో జులై 26- ఆగస్టు 19 మధ్యకాలంలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన అధికార ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ వివరాలు వెల్లడించింది. పార్లమెంట్ బోర్డు డైరెక్టర్లు కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు ఈ సమయాన్ని ఖరారు చేసింది.

జూన్ 12న జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అహ్మదీనెజాద్ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, ప్రత్యర్థులు మాత్రం ఆయన రిగ్గింగ్ ద్వారా గెలిచారని ఆరోపిస్తున్నారు. ఈ గెలుపు చెల్లుబాటు అవదని ఇరాన్‌లో అహ్మదీనెజాద్ ఎన్నికల ప్రత్యర్థి, మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావి నేతృత్వంలో గత పది రోజులుగా పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments