Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిన్‌జియాంగ్ అల్లర్లలో 129 మంది మృతి

Webdunia
పశ్చిమ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 189 మంది మృతి చెందారని సోమవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ అల్లర్లలో 800 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్యపై మరే ఇతర వివరాలు వెల్లడించలేదు.

జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంఖీలో ఓ ముస్లిం వర్గానికి చెందిన వెయ్యి మంది ఆందోళనకారులకు ఆదివారం అల్లర్లకు దిగారు. ఆందోళనకారులు సాధారణ పౌరులు, పోలీసులపై దాడులకు దిగారు. దీనికి సంబంధించి జరిగిన హింసాకాండలో నలుగురు వ్యక్తులే మృతి చెందారని మొదట జిన్‌హువా వెల్లడించింది. అయితే సోమవారం వచ్చిన వార్తల్లో మృతుల సంఖ్య 129కి పెరిగింది.

గత నెలలో దక్షిణ చైనాలోని ఓ కర్మాగారంలో ఉయ్‌ఘుర్స్, హాన్ చైనీస్ కార్మికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ తాజాగా ఉయ్‌ఘుర్ ముస్లిం వర్గం ఆందోళన చేపట్టింది. ఆందోళనకారులు అనేక కార్లకు నిప్పంటించారు. అంతేకాకుండా కొన్ని గంటలపాటు జరిగిన అల్లర్లలో వారు బస్సులపై దాడులు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్