Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి దశలో స్వాత్ ఆపరేషన్: పాక్ ప్రధాని

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ చెప్పారు. స్వాత్‌లో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులు హతమయ్యారని, వీరిలో ప్రధాన తీవ్రవాద నేతలు కూడా ఉన్నారని గిలానీ తెలిపారు.

దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన తాలిబాన్ తీవ్రవాదుల ప్రాబల్యాన్ని అణిచివేసేందుకు సైన్యం కొన్ని నెలల క్రితం సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సైనిక చర్య ముగింపు దశకు చేరుకుందని, స్వాత్ అభివృద్ధిపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టిసారిస్తోందని గిలానీ ఓ ఆన్‌లైన్ వార్తా సంస్థతో చెప్పారు.

కరాచీలో టెక్స్‌టైల్ సిటీని ప్రారంభించిన సందర్భంగా గిలానీ ఈ వ్యాఖ్యలు చేశారు. "తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్" తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మెహసూద్‌‍ను పట్టుకునే వరకు స్వాత్‌లో సైనిక చర్య కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన తొలి టెక్స్‌టైల్ విధానం దేశంలో ఉద్యోగాలు సృష్టిస్తుందని గిలానీ నమ్మకం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments