Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరిరోజుల్లో ఆధ్యాత్మిక భారతంవైపు జాక్సన్

Webdunia
" కింగ్ ఆఫ్ పాప్" మైఖేల్ జాక్సన్ గతించిన తర్వాత అతని భవిష్య ప్రణాళికలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చివరిరోజుల్లో మైఖేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలకు అతుక్కుపోయారట. అంతేకాదు ఇటీవల "జయహో.."తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి పనిచేయాలని అనుకున్నారట. రెహ్మాన్ స్వరపరిచిన ఓ జాతీయ గీతాన్ని తను రూపొందించబోయే ఆల్బమ్‌లో పొందుపరచాలని నిర్ణయించుకున్నారట.

" జయహో..."కు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత రెహ్మాన్ మైఖేల్ జాక్సన్‌ను కలిశాడట. ఆ సందర్భంలో జాక్సన్... తను త్వరలో రూపొందించబోయే ఆల్బమ్‌లో ఓ జాతీయగీతాన్ని సమకూర్చాలని రెహ్మాన్‌ను కోరాడట.

" స్లమ్ డాగ్ మిలియనీర్" సంచలన విజయానంతరం మైఖేల్ కూడా భారతదేశం నేపథ్యంగా తీసుకుని ఓ మహత్తరమైన గీతాన్ని ఆవిష్కరించాలని కలలు కన్నాడట. అందుకు అనుగుణంగా అవసరమైన సరంజామాను సైతం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇందులో భాగంగా తన అనుచరులను రెహ్మాన్‌తో మాట్లాడమని పురమాయించినట్లు సమాచారం. అంతేకాదు జీవిత దర్పణాల్లాంటి రవీంద్రుని రచనల్లోని జీవిత సత్యాలను తన ఆల్బమ్‌లో చొప్పించాలని కసరత్తు ప్రారంభించాడట. రవీంద్రుని రచనలతోపాటు రహస్యంగా హిందూత్వాన్ని తెలిపే గ్రంథాలను కూడా చదివినట్లు భోగట్టా.

అంతర్జాతీయ సమాజానికి ఆధ్యాత్మిక భారతం యొక్క విశిష్టతను తెలిపే కోరిక తీరకుండానే జాక్సన్ పరమపదించడం విషాదం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments