Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రునిపై ఈరోజు దీపావళి: నాసా ఖగోళ శాస్త్రజ్ఞులు

Webdunia
ప్రపంచవ్యాప్తంగానున్న ఖగోళ శాస్త్రజ్ఞులకు ఈ రోజు అత్యధ్భుతమైన రోజు కానుంది. నాసా దీపావళికి ముందే చంద్రునిపై బాంబులు పేల్చనుంది.

అమెరికా అంతరిక్ష ఏజెన్సీ నాసా చంద్రునిపై నీటికోసం వెతికేందుకుగాను శుక్రవారం తన వద్దనున్న సెన్సింగ్ స్యాటిలైట్ అల్క్రాస్ చంద్రుడిని ఢీకొట్టనుంది. భూమిప ై ఫుట్‌బాల్ మైదానంలోని మూడోవంతు భాగం ఎంత ఉంటుందో చంద్రునిలోని అంత సైజుపై అల్క్రాస్ ఢీ కొడుతుందనీ, ఢీకొట్టిన ప్రాంతంలో ఎంత గుంత ఏర్పడతుందో ఆ తర్వాత పరిశీలిస్తామని నాసా వెల్లడించింది. ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రగ్రహంలోని దక్షిణ ధృవంపై గంటకు తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహాన్ని ఢీకొనేలా ప్రయోగాలు చేస్తున్నారు.

ఢీ కొనడంతో చంద్రునిపైనున్న దుమ్ము, ధూళి దాదాపు పది కిలోమీటర్ల ఎత్తుకు ఎగరనుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. తాము నిర్వహించే ఈ ప్రయోగం వలన భవిష్యత్తులో అంతరిక్షంలో ప్రయాణించే ప్రయాణీకులకు నీటి కొరత తీరనుందని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రపంచవ్యాప్తంగానున్న ఖగోళశాస్త్రజ్ఞులు ఈ దృశ్యాన్ని టెలిస్కోప్‌ల ద్వారా వీక్షిస్తారని నాసా తెలిపింది. పేలుళ్ళ ప్రత్యక్ష ప్రసారాన్ని నాసా తన వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. ఇందులో ప్రత్యేకమైన యంత్రం ద్వారా చంద్రునిపై దుమ్ముతో కూడుకున్న ప్రత్యేక చిత్రాలను కూడా చూపిస్తుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

చంద్ర గ్రహాన్ని ఢీ కొనడంతో అక్కడ నిజంగానే నీరు ఉందా లేదా అనే విషయం స్పష్టమౌతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇటీవలే ఇస్రో తన ప్రత్యేక ఉపగ్రహం పంపిన ఛాయాచిత్రాల ద్వారా చంద్రునిపై నీరున్నట్లు ప్రకటించింది. దీంతో నాసా ఈ ప్రయోగానికి పూనుకుంది. మరి చంద్రునిపై నిజంగా నీరు ఉంటే అక్కడ కూడా పలు దేశాల ఆధిపత్య పోరు తప్పదేమో!

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments