Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందమామపై నీటి గుట్టు రట్టు చేసేందుకు నాసా రాకెట్ "ఢీ"

Webdunia
చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే....అని పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అదే చల్లటి వెన్నలనిచ్చే చందమామపై పరిశోధనలపేరుతో దాడులు జరుగుతున్నాయి. జాబిల్లిపై నీరుందని తెలిపిన ఇస్రో శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు అమెరికా ఖగోళశాస్త్రజ్ఞులు శుక్రవారం ఓ రాకెట్టును చంద్రుడిని ఢీకొట్టేందుకు పంపించారు. ఇది చంద్రుడిని ఢీ కొట్టింది. దీంతో దుమ్ము, ధూళి పెద్ద ఎత్తున ఎగిసిపడింది.

అక్కడ నీరున్న ఆనవాళ్లు తెలిసినప్పటినుంచి వాటి లోతుపాతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతరిక్ష శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉంది. ఆ గుట్టు తెలుసుకునేందుకుగాను అమెరికాలోని అంతరిక్ష పరిశోధనాకేంద్రం నాసా ఈరోజు ఒక రాకెట్‌ని ప్రయోగించింది.

నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఢీకొట్టిందని, దాంతో చందమామపై దుమ్ము, ధూళి భారీగా ఎగసిపడ్డాయని తెలుస్తోంది. చంద్రునిపై నీటిజాడల విషయమై సాగుతున్న పరిశోధనల్లో అత్యంత ఖర్చుతో కూడిన ప్రయోగంగా ఇది రికార్డు సృష్టించింది.

ఈ రాకెట్ ఢీ కొట్టిన సమయంలో అక్కడి చిత్రాలు అంతరిక్ష కేంద్రానికి అందుతాయి. వాటిని పరిశీలిస్తే చందమామ నీటి గుట్టు రట్టయిపోతుంది. అందుకు మరి కొన్ని గంటలు చాలని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments