Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో తొమ్మిదేళ్ళ రష్యా బాలికపై అత్యాచారం!

Webdunia
ప్రముఖ తీర ప్రాంత పర్యాటక కేంద్రం గోవాలో మరో ఘోరం జరిగింది. ఉత్తర గోవాలోని ఆరమ్‌బాల్ బీచ్‌‌లో స్నానం చేస్తున్న తొమ్మిదేళ్ళ తొమ్మిదేళ్ల బాలికపై గుర్తుతెలియని కామాంధుడు పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితరాలి తల్లి ఫెర్నమ్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీనిపై డిప్యూటీ ఎస్పీ సామి తవేర్స్ మాట్లాడుతూ.. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందినితపై అత్యాచార నిరోధక చట్టం 376, గోవా పిల్లల చట్టం 8 (2) ప్రకారం కేసు నమోదు చెసినట్టుచెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు.

కాగా, బాలిక సముద్రంలో స్నానం చేస్తుండగా, ఒక వ్యక్తి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాలిక కేకలు వేస్తూ తన తల్లి వద్దకు పరుగులు తీసింది. అమన్ అనే పర్యాటకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ బాలిక తల్లికి చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

ఆ తర్వాత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పనాజీ ఆస్పత్రికి తరలించారు. గత యేడాది డిసెంబరులో 25 సంవత్సరాల యువతిపై గోవాకు చెందిన ఓ రాజకీయనేత కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది.

అంతకుముందు ఎలెనా సుఖునోవా అనే రష్యా యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఇంతవరకు చిన్నపాటి ఆధారాన్ని కూడా సేకరించలేక పోయిన విషయం తెల్సిందే. గోవాకు వచ్చే పర్యాటకులపై ముఖ్యంగా రష్యా దేశస్తులపై జరుగుతున్న అత్యాచాలపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. తమ పౌరులకు కొన్ని హెచ్చరికలు కూడా చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments