Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్ఫ్ నుంచి తాలిబాన్లకు ఎక్కువ నిధులు

Webdunia
తాలిబాన్ తీవ్రవాదులు సానుభూతిపరుల నుంచే ఎక్కువ నిధులు పొందుతున్నారని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్న రిచర్డ్ హోల్‌బ్రూక్ చెప్పారు. తాలిబాన్లకు ఆఫ్ఘనిస్థాన్ అక్రమ డ్రగ్ వ్యాపారం కంటే విదేశాల్లోని సానుభూతిపరుల నుంచే ఎక్కువ నిధులు అందుతున్నాయని తెలిపారు.

దీనిని నిరోధించేందుకు అమెరికా ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టిందని వివరించారు. ఇదిలా ఉంటే తాలిబాన్ తీవ్రవాద గ్రూపుకు ధనిక ప్రాంతమైన గల్ఫ్ నుంచి ఎక్కువగా నిధులు వస్తున్నాయని, వారి కార్యకలాపాలకు పశ్చిమ యూరప్‌తో సహా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా డబ్బు అందుతోందని వెల్లడించారు.

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ వ్యతిరేక చర్యల పురోగతిని మంగళవారం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ అధికారులకు హోల్‌బ్రూక్ వివరించారు.

పాకిస్థాన్ సైన్యం ఆ దేశంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులతో జరుపుతున్న పోరాటం కారణంగా నిరాశ్రయులైన సాధారణ పౌరులకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాటానికి కూడా ఈ ప్రాంతం చాలా కీలకమని హోల్‌బ్రూక్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments