Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంబ్రిడ్జి ల్యాబ్‌‌లో 13వ నోబెల్ బహుమతి గ్రహీత "వెంకీ"

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2009 (08:54 IST)
అమెరికా, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలతో కలిసి రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని సాధించిన భారతీయ సంతతికి చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి ల్యాబ్ నుంచి నోబెల్ బహుమతి అందుకున్న 13వ శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించారు.

గతంలో ఇదే ల్యాబ్‌లో పని చేసిన 12 మంది ఈ అరుదైన పురస్కారం దక్కడం విశేషం. ప్రస్తుతం కేంబ్రిడ్జిలోని ఎంఆర్‌సి లాబొరేటరీ ఆఫ్ మాలిక్యురల్ బయాలజీలో హెడ్‌గా రామకృష్ణన్ పని చేస్తున్నారు. ఈయనను అందరూ ముద్దుగా వెంకీ అని పిలుస్తుంటారు.

కేంబ్రిడ్జి లాబొరేటరీ నుంచి గతంలో నోబెల్ బహమతిని కైవసం చేసుకున్న వారిలో.. ఫ్రెడ్ సంగెర్ (1958), మాస్క్ పెరుట్జ్ (1962), జాన్ కెడ్ర్యూ (1962), ఫ్లాన్సిస్ క్రిక్ (1962), జిమ్ వాట్సన్ (1962), ఫ్రెడ్ సంగెర్ (1980), అరోన్ క్లుగ్ (1982), జార్జెస్ కోహ్లెర్ (1984), సీసర్ మిల్‌స్టైన్ (1984), జాన్ వాకర్ (1997), సిడ్నీ బ్రెన్నెర్ (2002), జాన్ సుల్స్‌స్టాన్ (2002), రోబెర్ హౌర్‌విట్జ్ (2002)‌లు ఉన్నారు.

ఫ్రెడ్ సంగెర్ మాత్రం 1958, 1980 సంవత్సరాల్లో రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. రసాయన శాస్త్రంలో రైబోసోమ్ ప్రక్రియకు చేసిన పరిశోధనకు గాను రామకృష్ణన్‌కు అమెరికా, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలైన థామస్ ఇ స్టెట్జి, అడా ఇ యోనత్‌లతో కలిసి నోబెల్‌ను కైవసం చేసుకున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments