Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలోనూ భారతీయులపై జాతివివక్ష దాడులు

Webdunia
ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని జాతివివక్ష దాడులు జరుగుతున్నట్లు మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కెనడాలోనూ ఈ తరహా దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడాలో భారత బృందంపై జరిగిన జాత్యహంకార దాడికి సంబంధించి నలుగురు కెనడా పౌరులను అక్కడి అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది.

వాంకోవర్ శివారుల్లోని లాంగ్లే ప్రాంతంలో కొందరు భారతీయులపై వీరు జాతివివక్ష ప్రదర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు భారత సంతతి వ్యక్తులు వారాంతంలో టెన్నిస్ ఆడుతుండగా, నలుగురు కెనడా పౌరులు వారి వద్ద జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నిందితుల్లో ఓ వ్యక్తి ఫెన్స్ బోర్డును భారత టెన్నిస్ ఆటగాళ్లపై విసిరాడు. అది ఒకరికి తలపై తగిలింది.

అక్కడి నుంచి నిందితులు పరారవుతూ బాధితుల వస్తువులను కూడా తీసుకొని వెళ్లారు. భారతీయులపై దాడి చేసిన నలుగురు కెనడా పౌరులను అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి భారతీయుల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మంగళవారం వివిధ అభియోగాలతో కేసు నమోదు చేశామని కెనడా పోలీసులు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments