Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లర్ డ్రగ్‌తోనే మైఖేల్ జాక్సన్‌ మృతి

Webdunia
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌కు అతని వ్యక్తిగత వైద్యుడు కన్రాడ్ ముర్రే కిల్లర్ డ్రగ్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రాణానికే హాని తలపెట్టే అత్యంత శక్తివంతమైన మందును జాక్సన్‌కు ఇవ్వడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది.

మైఖేల్ జాక్సన్ మరో 24 గంటల్లో చనిపోతాడనగా ముర్రే అనస్తటిక్ ప్రొపోఫోల్ ఇచ్చాడనీ, ఆ మందు ప్రభావం వల్లనే జాక్సన్ మృతి చెందాడని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా ముర్రే అటువంటి ప్రాణాంతకమైన మందు ఇచ్చాడన్న అంశంపై ముర్రే తరపు న్యాయవాదులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అంతకుముందు కన్రాడ్ ముర్రే జాక్సన్‌కు ఎటువంటి ప్రమాదకరమైన మందులు వాడలేదని వారు వాదించారు. జూన్ 25న జాక్సన్ మృతిచెందిన సమయంలో ముర్రే ఆయన ప్రక్కనే ఉన్నారు.

ఇదిలావుంటే గతవారం టెక్సాస్ అధికారులు ముర్రే హస్టన్ మెడికల్ ఆఫీసును తనిఖీ చేశారు. ఈ తనిఖీలో వారికి లభ్యమైన కొన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments