Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో తరచుగా జోక్యం చేసుకొంటున్న పాకిస్థాన్ సైన్యం

Webdunia
పాకిస్థాన్ సైన్యం బహిరంగంగా, రహస్యంగా రెండు విధాలుగా కాశ్మీర్‌లో తరచూ జోక్యం చేసుకొంటున్నదని పర్యవసానంగా ప్రమాదకరమైన ఫలితాలు వస్తున్నాయని న్యూయార్క్‌కు చెందిన ఓ విశ్లేషకుడు వెల్లడించారు.

1947 ఆగస్ట్‌లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. జమ్ము, కాశ్మీర్ మహారాజు హరి సింగ్ స్వతంత్ర్యంగా ఉండటానికి వీలుకాకపోవడంతో తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిర్ణయించారు. పాకిస్థాన్ ఆరంభ రాజకీయ నాయకత్వం ఈ నిర్ణయాన్ని బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నించింది అని న్యూయార్క్‌లోని స్వతంత్ర విశ్లేషకుడు హమీద్ హుస్సేన్ అల్ జజీరా ఛానెల్‌కు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

స్థానిక కాశ్మీర్ ప్రజలను పూర్తిగా విస్మరించిన పాకిస్థాన్ సైన్యం గడచిన 60 సంవత్సరాలుగా పదే పదే అదే తప్పును చేస్తున్నది. 1965లో పాకిస్థాన్ రెండో భారీ తప్పిదానికి పాల్పడింది, కాశ్మీర్‌లోకి బలగాలను పంపి ఆక్రమించుకోవాలని చూసిందని హుస్సేన్ పేర్కొన్నారు.

1999 లో మరోసారి పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ నాయకత్వంలో కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాకిస్థాన్ పాల్పడిందని ఆయన తెలిపారు. పాకిస్థాన్ సైన్యం తన వైఖరిని మార్చుకొని స్థానిక ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇచ్చినప్పుడే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments